అభిసారిక సెక్స్ సైన్స్
డాక్టర్ పూషా దర్భా

అభిసారికకు స్వాగతం

లైంగిక ఆరోగ్యం, దాంపత్య బంధాలు మరియు వైవాహిక సంక్షేమానికి ఒక విశ్వసనీయమైన వేదిక

లైంగిక సమస్యల గురించి చర్చించడం అంత తేలికైన విషయం కాదు — కానీ మీరు ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేదు.

నేను మీ డాక్టర్ పూషా దర్భా, 38 ఏళ్లకు పైగా క్లినికల్ అనుభవం ఉన్న సెక్సాలజిస్టుని, థెరపిస్ట్‌ని! మీ సమస్యలను అర్థం చేసుకుని, సమస్య పట్ల స్పష్టతని, పరిష్కారాన్ని సాధించడంలోనూ, ఆత్మవిశ్వాసం నింపుకుని దాంపత్య అనుబంధాన్ని మెరుగుపరచుకోవడంలోనూ మీకు తోడ్పడటం నా లక్ష్యం.

మా కౌన్సిలింగ్ సేవలు (Confidential Counseling Areas)

  • లైంగిక ఆరోగ్య సలహాలు (Sexual Health Counseling) — జీవితంలో ఏ దశలోనైనా ఎదురయ్యే లైంగిక సామర్థ్యం, పనితీరు మరియు శారీరక/మానసిక ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం.
  • పెళ్ళికి ముందూ, తరువాతా సామరస్యం, అన్యోన్యత మెరుగుపరచుకునేందుకు (Premarital & Relationship Counseling) — వివాహపూర్వ, వైవాహిక బంధంలో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, సాన్నిహిత్యాన్ని పెంపొందించుకోవడానికి, దృఢమైన పునాది వేసుకోవడానికి.
  • సంతానలేమి మార్గదర్శకత్వం (Infertility Guidance - Sexual Factors) — దంపతుల సంతాన సాఫల్య ప్రయాణాన్ని ప్రభావితం చేసే సెక్సుపరమైన, మానసికమైన అంశాల పరిష్కారం కోసం.

చాలామంది ఈ క్లినిక్‌ను ఎందుకు విశ్వసిస్తున్నారు?

  • 1989 నుండి సైకోసెక్సువల్ మెడిసిన్‌లో అనుభవం (37+ years)
  • ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి హ్యూమన్ జెనెటిక్స్‌లో పిహెచ్‌డి (PhD)
  • కౌన్సిల్ ఆఫ్ సెక్స్ ఎడ్యుకేషన్ అండ్ పేరెంట్‌హుడ్ ఇంటర్నేషనల్ (CSEPI) ఫెలోషిప్
  • భారతదేశంలో సెక్సాలజీ రంగానికి చేసిన సేవలకుగాను CSEPI నుంచి గోల్డెన్ లాంప్ అవార్డు (2005) గ్రహీత
  • రోటరీ ఇంటర్నేషనల్ వారి అత్యున్నత పురస్కారం — 'Service Above Self' (2019) గ్రహీత
  • 70 సంవత్సరాల దీర్ఘ ప్రస్థానం కలిగిన భారతదేశపు అతిపురాతన సెక్సాలజీ పత్రిక 'అభిసారిక' కు 30 సంవత్సరాల పాటు ఎడిటర్‌గా వ్యవహరించడం
  • లైబ్రేట్ (Lybrate), ప్రాక్టో (Practo), ఐక్లినిక్ (iCliniq), బజాజ్ హెల్త్ వంటి ప్రముఖ హెల్త్‌కేర్ వేదికలపై అత్యుత్తమ పేషెంట్ రేటింగ్స్ కలిగిన విశ్వసనీయ కన్సల్టెంటు

ఇక్కడ ప్రతి సంప్రదింపు గోప్యంగా, గౌరవప్రదంగా మరియు ఎలాంటి అపార్థాలకు తావులేకుండా నిర్వహించబడుతుంది. మీకు సందేహాల నివృత్తి కావాలన్నా, మార్గదర్శకత్వం కావాలన్నా లేదా మనసు విప్పి మాట్లాడాలన్నా... మీకు సాదర స్వాగతం.

మా సేవలు & ప్రత్యేకతలు (Services & Specializations)

మా వద్ద లభించే సేవలు (ఇవే కాకుండా ఇతర సమస్యలకు కూడా సలహాలు అందించబడతాయి):

  • వివాహమైనా సెక్స్‌లో పాల్గొనలేకపోవడం (Unconsummated Marriage)
  • అంగస్తంభన సమస్య (Erectile Dysfunction)
  • త్వరగా స్ఖలనం అయిపోవడం (Premature Ejaculation)
  • స్త్రీల లైంగిక సమస్యలు (Female Sexual Problems)
  • లైంగిక కోరికలు తగ్గడం (Low Sexual Desire / Low 'Libido')
  • ఆర్గాజమ్/తృప్తి లేకపోవడం (Orgasm Problems)
  • కలయికలో నొప్పి, బాధ / వాజినిస్మస్ (Painful Sex / Vaginismus)
  • పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ (Performance Anxiety)
  • వివాహపూర్వ కౌన్సెలింగ్ (Premarital Counseling)
  • హస్తప్రయోగం — అపోహలు & సందేహాలు (Masturbation Concerns & Myths)
  • స్వప్నస్ఖలనాల మంచీ, చెడూ (Nightfalls Guidance)
  • పురుషాంగ పరిమాణం / రూపం / వంకర గురించిన ఆందోళనలు (Penis Size / Shape / Curvature Concerns)
  • పోర్న్ & సెక్స్ అడిక్షన్ నుంచి కోలుకోవడానికి కౌన్సిలింగ్ (Porn & Sex Addiction Recovery)
  • దాంపత్య సమస్యలు & సాన్నిహిత్యాన్ని మెరుగుపరచుకునే కౌన్సిలింగ్ (Marital & Intimacy Counseling)
  • ఏసెక్సువాలిటీ / కామరహిత ధోరణి (Asexuality Guidance)
  • స్వలింగ సంబంధాల సందేహాలు (Same Sex Relationship Concerns)

అపాయింట్‌మెంట్ వివరాలు (Consultation Details)

  • ఫోన్ / వీడియో కౌన్సిలింగ్ — సుమారు 25 నిమిషాలు
  • కౌన్సిలింగ్ థెరపీ సెషన్లు — సుమారు 50 నిమిషాలు
  • ప్రతి కౌన్సిలింగ్ పూర్తిగా గోప్యం.
Abhisarika Counseling Center
Ramsha Institute of Sexuality
39, Industrial Park, Samalkot, AP, 533440, India
Phone: +91 8500555365 • Email: drpoosha.sexologist@gmail.com